- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర పన్నులపై కనిపించని మాంద్యం
దిశ, న్యూస్ బ్యూరో:
ఆర్థిక మందగమనం, మాంద్యం అంటూ సీఎం కేసీఆర్ ఎంతచెప్పినా రాష్ట్రంలోని స్వీయ పన్నులపై మాత్రం దాని ప్రభావం శూన్యం. తాజా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆర్థిక మాంద్యం గురించి ఎన్నిసార్లు చెప్పినా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర పన్నుల వసూళ్లలో దాని ప్రభావం కనిపించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో జీఎస్టీ మినహా రాష్ట్ర పన్ను వసూళ్లలో ప్రగతి కనిపించింది. ఈ సంవత్సరానికి రూ. 39,133 కోట్లను స్టేట్ ఎక్సైజ్, సేల్స్ టాక్స్, ట్రేడ్ టాక్స్, వాహన పన్ను తదితరాలపై ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. అంతకంటే ఎక్కువే వసూలైంది. లక్ష్యం కంటే అదనంగా రూ. 1,057 కోట్లను ఆర్జించింది.
ఆర్థిక మాంద్యం కారణంగా దేశవ్యాప్తంగా టూవీలర్, ఫోర్ వీలర్ విక్రయాలు గణనీయంగా పడిపోయినా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒకింత పురోగతి ఉన్నట్లు బడ్జెట్ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. వాహనాల పన్ను ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,714 కోట్లను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుని దాన్ని సాధించింది. రానున్న సంవత్సరానికి రూ. 4,300 కోట్లు సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాహనాల విక్రయాలపైనా, పన్నుపైనా ఆర్థిక మాంద్యం తెలంగాణలో మచ్చుకు కూడా కనబడలేదు. ఇక పెట్రోలు తదితర సేల్స్ టాక్స్ ద్వారా రూ. 21,972 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంటే దాన్ని సాధించగలిగింది. ఇక రాష్ట్ర ఎక్సైజ్ (మద్యం అమ్మకాలు) శాఖ ద్వారా రూ. 10,901 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ. 12,600 కోట్లు సమకూరాయి. అంటే దాదాపు రూ. 1700 కోట్లను అదనంగా ఆర్జించింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ఈసారి బడ్జెట్‌లో రూ. 8300 కోట్లను అదనంగా ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
tags: Telangana, State Taxes, Vehicle Tax, State Excise, Revenue