- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గ్యాస్ భేష్.. చమురే తగ్గింది!
భారతదేశంలో కేజీ బేసిన్‌గా పేరొందిన కృష్ణా, గోదావరి తీరంలో ముడి చమురు నిల్వలు తరిగిపోతున్నాయి. ప్రభుత్వ చమురు సంస్థ ఓఎన్జీసీకి కేజీబేసిన పెట్టని కోట. ముంబై తరువాత అత్యధికంగా ముడి చమురును వెలికి తీసేది ఇక్కడి నుంచే… విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురుపై పూర్తిగా ఆధారపడకుండా దేశీయ చమురు, సహజవాయు అవసరాలను కేజీ బేసినే తీర్చేది.
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా వరకు విస్తరించిన కేజీ బేసిన్ పరిధి సుమారు 50 వేల చదరపు మీటర్లు. ఇక్కడ సుమారు 500 బావులున్నాయి. అయితే అందులో కేవలం 112 బావుల నుంచి మాత్రమే ఓఎన్జీసీ చమురు, సహజవాయువును ఉత్పత్తి చేస్తోంది. ఈ బావుల నుంచి సహజవాయువు బాగానే లభ్యమవుతున్నప్పటికీ.. ముడి చమురు ఉత్పత్తి సరిగ్గా సాగడం లేదు. నాలుగు దశాబ్దాలుగా కేజీ బేసిన్‌లోని బావుల నుంచి చమురు, సహజవాయువును ఓఎన్జీసీ వెలికితీస్తోంది. అయితే ఇప్పుడక్కడ ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతోంది.
కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి చేసే ముడి చమురు.. ఓఎన్జీసీ తవ్వితీసే మొత్తం ఉత్పత్తిలో 15శాతంగా ఉండేది. 2017 నుంచి క్రమంగా ఉత్పత్తి తగ్గిపోతోంది. కేజీ బేసిన్ నుంచి సుమారు 50 శాతం చమురు ఉత్పత్తి తగ్గిపోయింది.2017లో 903 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్‌ను వెలికి తియ్యగా.. 2018లో 802 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్‌ను ఓఎన్జీసీ వెలికి తీసింది. 2019వ సంవత్సరానికి వచ్చేసరికి ఇది మరింత తగ్గి 546 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ మాత్రమే వెలికి తియ్యగలిగింది.
కేజీ బేసిన్‌లో భూ ఉపరితలం నుంచి 3000 మీటర్లలోతులోని క్రూడాయిల్‌ను ఓఎన్జీసీ వెలికి తీస్తుండగా, ఇక్కడ 2000పీఎస్ఐ (పౌండ్ పర్ స్క్వేర్ ఇంచ్) ఒత్తిడి, 80 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అదే 4000 మీటర్లలోతున తవ్వితే మరింత క్రూడాయిల్ దొరుకుతుందని ఓఎన్జీసీ అంచనావేస్తోంది. అయితే అంతలోతున డ్రిల్లింగ్ వేయాలంటే అక్కడ 5,000 పీఎస్ఐ (పౌండ్ పర్ స్క్వేర్ ఇంచ్) ఒత్తిడి ఉంటుందని, 200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతలోతున డ్రిల్లింగ్ చెయ్యాలంటే ఆధునిక సాంకేతికతోపాటు ఖరీదైన అంశమని ఓఎన్జీసీ తటపటాయిస్తోంది.
వాటిని సమకూర్చుని డ్రిల్లింగ్ చేస్తే ఒక్కో బావికి 5 నుంచి 5.5 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఓఎన్జీసీ అంచనావేస్తోంది. ప్రస్తుతం తాటిపాక జీజీఎస్ పరిధిలో 50 బావులుండగా 45 మాత్రమే చమురు ఉత్పత్తి చేస్తున్నాయి. కేశనపల్లి జీజీఎస్ పరిధిలో 59 బావులుండగా 35 బావుల నుంచే ఉత్పత్తి జరుగుతోంది. మోరి జీజీఎస్ పరిధిలో 58 బావులుంటే 40 బావుల నుంచే ఉత్పత్తి జరుగుతోంది. పొన్నమండలో 7 బావులు, మండపేటలో 16 బావులు పూర్తిగా ఉత్పత్తి చేస్తున్నాయి. నరసాపురం జీజీఎస్ పరిధిలో 20 బావులుంటే ఒక్కటి కూడా ఉత్పత్తి చేయడం లేదు.
ఈ చమురు బావులకుతోడు కొత్తగా నాగాయలంక, బంటుమిల్లి, మల్లేశ్వరం తదితర ప్రాంతాల్లో ఓఎన్జీసీ నిల్వల్ని కొనుగొంది. అయితే వీటి నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తే ఫలితం ఉంటుందా? లేదా? అన్న తర్జన భర్జనలో పడింది. అయితే విదేశీ చమురు సంస్థల సాయంతో ఈ బావుల్లో చమురుపై అంచనా వేయాలన్న ఆలోచనలో ఓఎన్జీసీ ఉంది. అయితే దానికి మరింత ఖర్చవుతుందేమోనని వెనకడుగేస్తోంది. చమురు అడుగంటుతున్న సమయంలో సహజవాయువు ఉత్పత్తిపై ఓఎన్జీసీ ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయకపోవడం విశేషం.