ఏపీలో మండల పరిషత్ నామినేషన్లివే..!

by srinivas |   ( Updated:2020-03-12 04:02:45.0  )
ఏపీలో మండల పరిషత్ నామినేషన్లివే..!
X

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడవు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,696 మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనుండగా, మొత్తం 50,063 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే 45,418 మంది నామినేషన్‌లు దాఖలు చేయడం విశేషం.

జిల్లాల వారీగా నామినేషన్ల వివరాల్లోకి వెళ్తే…

1) శ్రీకాకుళం జిల్లాలోని 668 మండల పరిషత్ స్థానాలకుగాను 3336 నామినేషన్లు దాఖలయ్యాయి.
2) విజయనగరం జిల్లాలోని 549 మండల పరిషత్ స్థానాలకుగాను 2733 నామినేషన్లు దాఖలయ్యాయి.
3) విశాఖపట్నం జిల్లాలోని 651 మండల పరిషత్ స్థానాలకుగాను 3714 నామినేషన్లు దాఖలయ్యాయి.
4) తూర్పుగోదావరి జిల్లాలోని 1086 మండల పరిషత్ స్థానాలకుగాను 5563 నామినేషన్లు దాఖలయ్యాయి.
5) పశ్చిమగోదావరి జిల్లాలోని 863 మండల పరిషత్ స్థానాలకుగాను 4598 నామినేషన్లు దాఖలయ్యాయి.
6) కృష్ణా జిల్లాలోని 723 మండల పరిషత్ స్థానాలకుగాను 3671 నామినేషన్లు దాఖలయ్యాయి.
7) గుంటూరు జిల్లాలోని 805 మండల పరిషత్ స్థానాలకుగాను 3852 నామినేషన్లు దాఖలయ్యాయి.
8) ప్రకాశం జిల్లాలోని 742 మండల పరిషత్ స్థానాలకుగాను 4115 నామినేషన్లు దాఖలయ్యాయి.
9) నెల్లూరు జిల్లాలోని 554 మండల పరిషత్ స్థానాలకుగాను 2832 నామినేషన్లు దాఖలయ్యాయి.
10) కర్నూలు జిల్లాలోని 804 మండల పరిషత్ స్థానాలకుగాను 4022 నామినేషన్లు దాఖలయ్యాయి.
11) అనంతపురం జిల్లాలోని 841 మండల పరిషత్ స్థానాలకుగాను 4575 నామినేషన్లు దాఖలయ్యాయి.
12) చిత్తూరు జిల్లాలోని 858 మండల పరిషత్ స్థానాలకుగాను 4260 నామినేషన్లు దాఖలయ్యాయి.
13) కడప జిల్లాలోని 553 మండల పరిషత్ స్థానాలకుగాను 2792
నామినేషన్లు దాఖలయ్యాయి.

tags : mandal parishad nomination, mp nominations, ap, districts,

Advertisement

Next Story

Most Viewed