- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వేధింపులు ఆపండి : ఎంపీ రఘురామ
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ఐటీ చట్టం సెక్షన్ 66ఏ కింద పోలీసు కేసుల నమోదు ఆపాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. నవ సూచనలు పేరుతో బుధవారం తొమ్మిదో లేఖ రాశారు. ఐటీ చట్టం సెక్షన్ 66ఏ ఆ చట్టాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా కార్యకలాపాలపై ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
వాస్తవానికి ఈ చట్టాన్ని 2015లోనే సుప్రీంకోర్టు రద్దు చేసిందని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు ఆ సెక్షన్‌పైనే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. మరోవైపు ఎవరైనా తన ఫొటోను వారి ఫోన్‌లో డిస్ ప్లే చేస్తే లేదా మెసేజింగ్ యాప్‌లలో వాడుకుంటే వారిని పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఆ వేధింపులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూసుకోవాలని ఎంపీ రఘురామ లేఖలో డిమాండ్ చేశారు.
Advertisement
Next Story