- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిడ్నీ టెస్టులో స్మిత్ రికార్డులు
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మాన్ స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీ సాధించాడు. తొలి రోజు 31 పరుగులు చేసిన స్మిత్.. రెండో రోజు దూకుడు పెంచాడు. ఒకవైపు ఆసీస్ వికెట్లు పడుతున్నా స్మిత్ తన దూకుడును ఆపలేదు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన స్మిత్ 131 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. స్టీవ్ స్మిత్‌కు ఇది టెస్టుల్లో 27వ సెంచరీ. దీంతో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (27), అలెన్ బోర్డర్, గ్రేమ్ స్మిత్ సరసన చేరాడు. కోహ్లీ 146 ఇన్నింగ్స్‌లో 27 సెంచరీలు చేయగా.. స్మిత్ కేవలం 136 ఇన్నింగ్స్‌లోనే ఈ మార్కును అందుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 27 సెంచరీలు డాన్ బ్రాడ్‌మాన్ (70 ఇన్నింగ్స్) తర్వాత స్థానం స్మిత్‌దే.
ఇక 2010 తర్వాత అత్యధిక టెస్టు సెంచరీలు కోహ్లీ (27) పేరున ఉండగా ఆ తర్వాత స్మిత్ (26) రెండో స్థానంలో ఉన్నాడు. కేన్ విలియమ్ సన్ (24), డేవిడ్ వార్నర్ (24), అలిస్టర్ కుక్ (23) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐసీసీ మెన్స్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు అందుకున్న స్మిత్‌కు 2017 తర్వాత స్వదేశంలో చేసిన తొలి సెంచరీ ఇదే కావడం విశేషం. ఇక స్మిత్ ఇండియాపై 25 టెస్టు ఇన్నింగ్స్‌లో 1570 పరుగులు చేశాడు.