- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో 99 శాతం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి పనులు, డ్యూటీలకు వెళ్లే వన్ పర్సెంట్ జనాలు మాత్రమే రోడ్లపై కనపడుతున్నారు. ఇన్నిరోజులు గంటలకు గంటలు ఆఫీస్‌ల్లో పనిచేసిన వారందరికీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోంలు ఇవ్వగా, మరికొందరికి లీవ్స్ మంజూరు చేశారు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ మెుత్తం ఇంట్లో నుంచి బయటకు రాకుండా తిని రెస్ట్ తీసుకుంటున్నారు. ఓన్లీ నిత్యావసరాలకు మాత్రమే మార్నింగ్ బజారుకెళ్లి కూరగాయలు, మంచినీళ్లు తెచ్చుకొని గేట్‌లాక్ చేసుకుంటున్నారు. మొత్తంగా దినసరి కూలీల నుంచి షాపుల యజమానుల వరకు కరోనా వైరస్ భయంతో హోం క్వారంటైన్ చేస్తుండటంతో మెయిన్ రోడ్ల నుంచి గ్రామ వీధుల వరకు అన్నీ బోసిపోయి కనపడుతున్నాయి.
ప్రజెంట్ దేశవ్యాప్తంగా జనాలు మొత్తం తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా.. అనే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. బయటకు వెళ్తే కరోనా వైరస్ బారిన పడుతామన్న భయంతో ఇంతకన్న మించిన పనేం లేదని ఇంట్లోనే రిలీఫ్ అవుతున్నారు. మార్చి 31 తర్వాత కూడా పరిస్థితులు అనుకూలించకుంటే మళ్లీ లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు 200 పర్సెంట్ ఉన్నందున, ఇక ఇంట్లోనే ఉండేందుకు బాడీని అలవాటు చేసుకుంటున్నారు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కనీసం ఇంటి గడప దాటకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎవరైనా బజార్ల నుంచి సౌండ్ చేస్తూ వెళ్తుంటే డోర్ తీసే సాహసం కూడా చేయకుండా కిటికీలోంచే తొంగి చూస్తున్నారు. ఇంట్లో ఐదుగురి కంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే అందరూ వీలైనంత వరకు మాస్క్‌లు ధరించే ఉంటున్నారు.
దేశంలో ప్రజలు మొత్తం ఇంట్లోనే ఉంటూ కాలం ఎల్లదీస్తున్నారు. ఉదయం టిఫిన్ చేసి గడప దాటకుండా పనులు చేస్తూ మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఓ కునుకు తీసి ఈవినింగ్ టీవీలు, వార్తాపత్రికలు, పుస్తకాలు చదివే పనుల్లో నిమగ్నం అవుతున్నారు. మళ్లీ రాత్రికి ఇంత తిని పడుకొని తెల్లవారుజామున పొద్దుపోయాక లేస్తున్నారు. ఎలాగూ ఉద్యోగానికి పోవాలన్న టెన్షన్ లేకపోవడమే కాకుండా గడప దాటే అవకాశాలు కూడా అస్సలే లేకపోవడంతో కొంత నర్వస్‌గా ఫీల్ అయినప్పటికీ తనకు తాను రక్షణతోపాటు, కుటుంబం, సమాజానికి సంబంధించిన హెల్త్ విషయం కాబట్టి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా ఫార్ములాను ఫాలో అవుతున్నారు.
Tags: Corona Virus, Eat, sleep, Morning, Supermarket, Vegetables, Jobs, House, Masks, Merchants, Lockdown, Books