- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఈటల ఓడిపోతారనే ఆయన బావమరది ఇలా చేశాడు’
దిశ, చేవెళ్ల : దళిత బంధు పథకంతో ఎలాగైనా ఓటమి పాలు అవుతామనే భయంతో ఈటెల రాజేందర్ బావమరిది దళితులను దూషించడం తగదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆరోపించారు. ఈటల రాజేందర్ బావమరిది దళితులను దూషిస్తూ వాట్సాప్ మెసేజ్ చేయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా శంకర్‌పల్లి ఇంద్రారెడ్డి చౌరస్తాలో ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు పథకం ప్రవేశపెడితే ఈటల రాజేందర్ బావమరిది దళితులను దూషిస్తూ వాట్సాప్ మెసేజ్ చాట్ చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. దళిత బంధు పథకం అమలైతే ఎలాగైనా తన బావ ఈటెల రాజేందర్ ఓడిపోతాడని జమునా రెడ్డి సోదరుడు కొండవీటి మధుసూదన్‌రెడ్డి ఈటల రాజేందర్ పౌల్ట్రీ పార్ట్నర్ తో ఫోన్ చాట్ చేశాడు అని గుర్తు చేశారు.
ఇప్పటికే ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి హుజురాబాద్ లో కోట్ల రూపాయలు డబ్బులు పంపిణీ చేస్తున్నాడు అని ఆరోపించారు. దళితులను ‘మాదిగా నా కొడుకులను నమ్మలేము’ అని తిడుతూ మెసేజ్ చేయడంపై శంకర్‌పల్లి టీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట రెడ్డి, శంకర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయ్ కుమార్, శంకరపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కావలి గోపాల్, వాసుదేవ్ కన్నా, గాజుల గూడెం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పర్వేద ఎంపీటీసీ వెంకటరెడ్డి, మహాలింగాపురం ఎంపీటీసీ యాదగిరి, శంకర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు చంద్రమౌళి, సంతోష్ రాథోడ్ , గోపాల్, కోఆప్షన్ సభ్యులు వెంకటరెడ్డి, నాయకులు గోపాల్ రెడ్డి , శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.