పాలిసెట్ ఎంట్రెన్స్‌లో కాకతీయ విద్యార్ధికి స్టేట్ ఫస్ట్

by Shyam |
polycet results
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ పాలిసెట్ ఎంట్రెన్స్ ఫలితాల్లో నిజామాబాద్ కాకతీయ ఒలింపియాడ్ విద్యార్ధి రెహమాన్ స్టేట్ ఫస్ట్ వచ్చాడు. బుధవారం పాఠశాల ఆవరణలో కాకతీయ ఒలింపియాడ్ డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు స్టేట్ ఫస్ట్ (120 మార్కులకు 118 మార్కులు) ర్యాంక్ సాధించిన అబ్దుల్ రెహమాన్ ను అభినందించారు. పాఠశాలకు చెందిన మరో విద్యార్ధి సాయి అక్షయ్ రాష్ట్ర స్థాయిలో 12 వ ర్యాంక్ సాంధించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ రామోజీ రావు, తేజస్విని లు మాట్లాడుతూ… తమ పాఠశాలలో ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ శిక్షణ ఇస్తున్నాము అన్నారు. విద్యార్థులను జాతీయ ప్రవేశ పరీక్షలు కు సిద్ధం చేస్తున్నాం అని పేర్కొన్నారు.

అందుకే పాలిసెట్ లో 1,12ర్యాంకు లు సాధించామన్నారు. ఒలింపియాడ్ విద్యార్థులకు కళాశాల అధ్యాపకులచే బోధన జరుగుతుంది అన్నారు. ప్రణాళిక బద్ధంగా, అనుభవం గల వారి చేత పాఠాలు ఒకటికి రెండు సార్లు బోధన, వాటిపై సందేహాలు నివృత్తి చేయడం జరుగుతుంది అన్నారు. ఈ సందర్బంగా స్టేట్ ఫస్ట్ వచ్చిన అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ… ‘కేఓస్ లో జాయిన్ తరువాత మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువు కష్టం గా కాకుండా ఇష్ట పడేలా చెప్పారు. ఐఐటీ, మెడికల్ ఎంట్రెన్స్ పై సందేహాలు తీర్చారు. స్టేట్ ర్యాంక్ సాధన కు సహకరించిన ఒలింపియాడ్ యాజమాన్యం కు ధన్యవాదములు’ తెలిపారు.

Next Story

Most Viewed