- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘గన్నీ బ్యాగుల కొరత తీర్చాలి’’
దిశ, న్యూస్‌బ్యూరో: వ్యవసాయ మార్కెట్లలో రైతుల రద్దీ పెరిగితే కరోనా వైరస్ (కొవిడ్-19) తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉందనీ, అందుకే గ్రామాల్లో ఎక్కడిక్కడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేస్తున్నమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు తెలిపారు. అయితే, రాష్ట్రంలో గన్నీ(గోనె) బ్యాగుల కొరత ఉందనీ, ఆ కొరత తీర్చాలని ఆయన కేంద్రాన్ని కోరారు. బుధవారం కేంద్ర మంత్రితో నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన పలు ఆంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గన్నీ బ్యాగుల అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది వరకే ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. గన్నీ బ్యాగుల విషయంలో ఆలస్యం చేస్తే తీవ్ర ఇబ్బందులు వస్తాయని వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లను ఎక్కడిక్కడా కొనుగోలు చేయడానికి రాష్ట్రంలో 7,077 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు కూపన్లు అందజేసి కొనుగోలు కేంద్రాలలో రద్దీ లేకుండా దశల వారీగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో 40లక్షల ఎకరాల నుంచి 1 కోటి 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అసాధారణ రీతిలో మార్కెట్లకు పోటెత్తనుందన్నారు. బత్తాయి కొనుగోళ్లు ప్రధానంగా ఢిల్లీ మార్కెట్ మీద ఆధారపడి ఉన్నయనీ, కేంద్రం బత్తాయి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రాబోయే ఖరీఫ్‌లో రిజర్వ్ బ్యాంక్, బ్యాంకుల అవసరానికి సరిపడా రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. విత్తన సరఫరాకు సంబంధించి అంతరాష్ట్ర సమస్యలున్నాయనీ వాటిని కేంద్రం చొరవ తీసుకుని పరిష్కరించాలన్నారు. విత్తన ప్యాకేజీకి సంబంధించిన సామగ్రి సింగపూర్‌లో చిక్కుకుపోయిందని తెలిపారు. కేంద్రం దాన్ని పరిష్కరించకుంటే రాబోయే ఖరీఫ్‌లో రైతులకు విత్తనాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనీ, కావున సమస్య పరిష్కరించాలని కోరారు.
Tags: shortage of gunny bags, telangana, union minister narendra singh, video conference