- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాకుల్లారా.. ముందు దానర్థం తెలుసుకోండి.. స్టార్ యాంకర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ టాప్ యాంకర్లలలో ఝాన్సీ ఒకరు. సుమ తర్వాత అంతటి సీనియారిటీ ఉన్న ఈ యాంకరమ్మ ఒక పక్క సినిమాలు, మరోపక్క ఈవెంట్లు అంటూ బిజీబిజీగా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఝాన్సీ ఏదైనా తనకు నచ్చని విషయంపై ఘాటుగానే స్పందిస్తుంటుంది. తాజాగా మీడియాపై ఝాన్సీ ఘాటు విమర్శలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఒక పోస్ట్ పెట్టింది.
“అనగనగా ఓ ఎద్దు.. దానికో పుండు, ఎద్దు పుండు కాకికి ముద్దు! కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచిపొడిచి పురుగులు తిన్నాయి. పుండును పెద్దది చేశాయి. ఎద్దు బుసలు కొట్టి రెచ్చిపోయింది. కాకులు గోల పెంచాయి. మైకులు పెట్టి మరీ మురికి గొట్టాలను జనాల ఇళ్లల్లోకి వదలడానికి మించి వార్తలు లేవా? సినిమా ఇంట పెళ్లి అయినా, విడాకులు అయినా ఎన్నికలైనా లోకులకు సందడి అనుకొని హడావిడి చేస్తున్న కాకుల్లారా.. ప్రజా ప్రయోజనం అంటే ఏంటో నిఘంటువులో చూడండి” అంటూ చెప్పుకొచ్చింది. మీడియా అవసరమైన వాటిమీదకంటే అనవసరమైన వాటిమీద ఫోకస్ చేస్తుందని ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది. ప్రజలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కాకుండా.. మీడియా ఏం చూపించాలనుకుంటుందో అదే చూడాలని జనాన్ని ఫోర్స్ చేస్తుంది. ఈ క్రమంలో జనాలు కాపలా కుక్కల యొక్క మేకలుగా మారిపోయామని అభిప్రాయపడింది. మీడియా మనుషులను హిప్నటైజ్ చేస్తుందని.. టీవీ చూస్తున్నంత సేపు ప్రజలు తమ సెన్స్ కోల్పోతున్నారని వివరించింది. దయచేసి ఇలాంటి నాన్‌సెన్స్‌కు దూరంగా ఉంటూ.. బెట్టర్ న్యూస్ చూజ్ చేసుకోవాలని సూచించింది.