- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా వరద నీరు.. SRSP గేట్ల ఎత్తివేత!
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌కు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుండటంతో సోమవారం ప్రాజెక్టు గేట్లు తెరచి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు అధికారులు సందీప్ దేశ్ పాండే, రామారావులు తెలిపారు. ఈరోజు తెల్లవారు జామున మహారాష్ట్రలోని భలేగావ్ ప్రాజెక్ట్ 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలడంతో 70వేల క్యూసెక్కుల వరదనీరు, సెకన్‌కు 50వేల క్యూసెక్కుల చొప్పున SRSPకు చేరుకుంటోందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దీంతో నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. అలాగే, ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని.. పరివాహక ప్రాంతంలో పశువులను కాసేందుకు తీసుకువెళ్లొద్దని స్థానిక తహసీల్దార్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. SRSPకు ప్రస్తుత ఇన్ ఫ్లో 32, 352 వేల క్యుసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 25,982 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,090.70 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90TMCలు కాగా, ప్రస్తుతం 88.662 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు ఎస్కేప్ గేట్లు ఎత్తి 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు, మధ్యాహ్నం వరకు ఆర్‌సీ గేట్లు తెరిచే అవకాశం ఉందని ప్రకటించారు.