మహబూబ్‌నగర్‌లో ఉచిత బియ్యం పంపిణీ

by Shyam |
మహబూబ్‌నగర్‌లో ఉచిత బియ్యం పంపిణీ
X

దిశ, మహబూబ్ నగర్ : జిల్లా కేంద్రంలో 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి నిరుపేదకు బియ్యం అందేలా చూడాలని రేషన్ డీలర్లను కోరారు. ఎక్కడా కూడా నిరుపేదలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు. లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

Tags: free ration, distribution , mahabubnagar

Advertisement

Next Story