శ్రీలంక క్రికెట్ బోర్డు భారీ విరాళం !

by Shiva |   ( Updated:2020-04-12 01:40:03.0  )
శ్రీలంక క్రికెట్ బోర్డు భారీ విరాళం !
X

కరోనాపై పోరాటానికి పలు దేశాల క్రీడా బోర్డులు, అసోసియేషన్లు తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ రూ. 51 కోట్ల విరాళాన్ని భారత ప్రభుత్వానికి అందించింది. ప్రస్తుతం ఇదే బాటలో శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా తమ దేశానికి సాయం ప్రకటించింది. కరోనాపై పోరాటం చేస్తున్న శ్రీలంక ప్రభుత్వానికి 25 మిలియన్ల శ్రీలంకన్ రూపాయలను (భారత కరెన్సీలో రూ.10 కోట్లకు సమానం) శ్రీలంక ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రతా నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును బోర్డు అధ్యక్షుడు షమ్మి సెల్వ శ్రీలంక అధ్యక్షుడు గొటబయి రాజపక్సెకు అందించారు.

Tags: Srilanka President, Cricket board, BCCI, Donation, Corona

Advertisement

Next Story