- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవి నవరత్నాలు కాదు బూడిద రత్నాలు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయంటూ ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..బూడిద రత్నాలను నవరత్నాలుగా ప్రచారం చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతోందని విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఒక్క హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వైసీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైందన్నారు.
రాష్ట్ర అభివృద్ధిపై జగన్ సర్కార్ ఫోకస్ పెట్టకుండా బూతులు తిట్టడంలో.. అక్రమ కేసులు బనాయించడంపైనే దృష్టి పెడుతుందని ధ్వజమెత్తారు. బూతులు తిట్టడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారంటూ చురకలంటించారు. మంత్రి కొడాలి నాని అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది దురదృష్టకరమన్నారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయేనని అలాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిందే కాకుండా పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లపై కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. రాబోయే రోజుల్లో కొడాలి నానికి గుడివాడ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రెండున్నరేళ్లకే ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు.