తిరుపతిలో ప్రారంభమైన శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

by Hamsa |   ( Updated:2021-02-10 04:36:54.0  )
తిరుపతిలో ప్రారంభమైన శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు
X

దిశ,వెబ్‌డెస్క్: టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు బుధ‌వారం తిరుప‌తిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన 400 మందికి పైగా భ‌జ‌న మండ‌ళ్ల క‌ళాకారులు శ్రీ పురంద‌రదాస కీర్త‌న‌ల‌ను చ‌క్క‌గా ఆల‌పించారు. ఉద‌యం 10 గంటల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు బృందాల వారీగా క‌ళాకారులు దాస ప‌దాల‌ను గానం చేశారు. ఈ కార్యక్రమంలో దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద‌తీర్థాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఫిబ్ర‌వ‌రి 11న అలిపిరిలో పుష్పాంజ‌లి

ఆరాధ‌నోత్స‌వాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 11న ఉదయం 6 గంటలకు అలిపిరి వ‌ద్ద‌గ‌ల శ్రీ పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పించనున్నారు. అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు హ‌రిదాస‌రంజ‌ని క‌ళాకారుల‌తో సంగీత కార్య‌క్ర‌మం, పండితుల ధార్మికోప‌న్యాసాలు, పురంద‌ర‌దాస సంకీర్త‌న విభావ‌రి త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించనున్నారు.

-టీటీడీ, ప్రజా సంబంధాల అధికారి

Advertisement

Next Story