అంతర్జాతీయ క్రికెట్‌కు ఉపుల్ తరంగ గుడ్‌బై

by Shyam |
Upul Tharanga
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక డాషింగ్ ఓపెనర్ ఉపుల్ తరంగ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రికెట్ అభిమానులందరికీ ఆయన సుపరిచితమే. దేశం తరపున ఆడి, ఎన్నో కీలక విజయాలు అందించిన తరంగా, ఒక్కసారిగా అభిమానులను షాక్‌కు గురిచేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, తరంగ కెరిర్‌లో 235 వన్డేలు ఆడగా, 6951 పరుగులు చేశాడు. 31 టెస్టుటు ఆడి.. 1745 పరుగులు చేశాడు. 26 టీ20 ఆడిన ఆయన 407 పరుగులు చేశాడు. తన చివరి వన్డే మ్యాచ్‌ను 2019 మార్చి 16న సౌతాఫ్రికాపై ఆడాడు. అంతేగాకుండా శ్రీలంక తరపున 2007,2011 రెండు వరల్డ్‌కప్‌లు ఆడిన తరంగ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్ సిరీస్‌లో శ్రీలంక దిగ్గజ ఆటగాడు జయసూర్యతో కలిసి తరంగ వన్డే ఓపెనింగ్‌ రికార్డు భాగస్వామ్యం సాధించడంతో పాటు 102 బంతుల్లో 109 పరుగులు చేసి ప్రపంచానికి తానేంటో నిరూపించుకున్నాడు.

అయితే.. తరంగ సడన్‌ రిటైర్మెంట్ నిర్ణయం శ్రీలంక క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆయన వీడ్కోలును జీర్ణించుకోలేని క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. అంతేగాకుడా తరంగ కూడా దేశం తరపున ఆడిన క్షణాలను గుర్తుచేసుకుంటూ.. భావోద్వేగ ట్వీట్ చేశాడు. ‘‘నేటితో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలనుకుంటున్నా. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. 16 ఏళ్ల పాటు దేశానికి క్రికెట్‌ రూపంలో సేవలందించడం గొప్ప అనుభూతి. ఈ 16 ఏళ్లలో జట్టుతో ఎన్నో జ్ఞాపకాలతో పాటు మంచి స్నేహితులు ఎందరో దొరికారు. విఫలమైన ప్రతీసారి నాపై ఉన్న నమ్మకంతో అవకాశాలు ఇచ్చిన శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇన్నేళ్ల పాటు నాకు మద్దతునిచ్చిన అభిమానులకు రుణపడి ఉన్నా. అందరికీ ధన్యవాదాలు’’ అంటూ ఎమెషనల్ అయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed