లంకన్ ప్రీమియర్ లీగ్ వాయిదా

by Shiva |
లంకన్ ప్రీమియర్ లీగ్ వాయిదా
X

దిశ, స్పోర్ట్స్: అందరూ ఊహించినట్టుగానే లంకన్ ప్రీమియర్ లీగ్ (LPL)ను వాయిదా(Postponed) వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) మంగళవారం ప్రకటించింది. ఈ నెల 28నుంచి ఎల్‌పీఎల్‌(Lankan Premier League)ను నిర్వహించాలని శ్రీలంక క్రికెట్(Sri Lankan cricket) భావించింది. కానీ పూర్తిగా సన్నద్దం కాకపోవడంతోపాటు కొవిడ్(Kovid) కారణంగా కొలంబో ఎయిర్‌పోర్టు(Colombo Airport)లో కార్యాకలాపాలు ప్రారంభం కాకపోవడం వల్ల లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. ఐపీఎల్(IPL) ముగిసిన తర్వాత నవంబర్ రెండోవారంలో ఎల్‌పీఎల్(LPL) నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు(Sri Lankan cricket Board) వెల్లడించింది.

‘శ్రీలంక వైద్య వర్గాల(Sri Lankan medical communities)తో చర్చించిన అనంతరం మాకో స్పష్టత వచ్చింది. దేశంలోకి వచ్చే ఎవరైనా తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్‌(14 days quarantine)లో ఉండాల్సిందేనని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్లు(Cricketers), సిబ్బంది అన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండలేరు. దీంతో లీగ్‌(League)ను నవంబర్ రెండో వారానికి వాయిదా వేయాలని నిర్ణయించాం’ అని శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మి సిల్వ((President of Sri Lanka Cricket Shammi Silva) మీడియాకు తెలిపారు. ఐదు ఫ్రాంచైజీల(Five franchises)తో నిర్వహించ తలపెట్టిన లంకన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ప్రకారం అగస్టు 28 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed