- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంగూలీకి మద్దతిస్తాం: శ్రీలంక క్రికెట్
దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పోటీచేస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డ్(ఎస్ఎల్‌సీ) ప్రకటించింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ కూడా గంగూలీ అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలిచాడు. ఇప్పుడు శ్రీలంక కూడా తమ ఓటు గంగూలీకే అని చెప్పడం పెద్ద విజయంగానే భావించవచ్చు. శ్రీలంక మీడియాతో మాట్లాడిన ఎస్ఎల్‌సీ ఉన్నతాధికారి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ‘ఒకవేళ సౌరవ్ గంగూలీ బరిలో దిగితే తాము అతనికే మద్దతుగా ఉంటామని, బీసీసీఐ మరెవరిని బరిలో నిలిపినా మద్దతు కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు. ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ మరోసారి బరిలో నిలవడం లేదని గతవారమే ప్రకటించారు. పీసీబీ అధ్యక్షుడు ఎహసాన్ మణి కూడా పోటీ పడట్లేదని ప్రకటించారు. ఈసీబీ అధ్యక్షుడు కొలిన్ గ్రీవ్స్ మాత్రమే ఇప్పటివరకు అధికారికంగా ఐసీసీ అధ్యక్ష పోటీలో ఉన్నట్లు ప్రకటించుకున్నారు. అయితే, బీసీసీఐ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఐసీసీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక తప్పక నిర్ణయాన్ని తెలియజేస్తామని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐసీసీ అధికార పీఠంపై గంగూలీ ఉంటేనే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.