- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీ కాళహస్తీలో ఆర్జిత సేవలు రద్దు
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీ ఆలయంలో అన్నిరకాల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు దేవాలయ కార్యనిర్వహణాధికారి బుధవారం వెల్లడించారు. కమిషనర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇందులో రోజువారీగా దేవస్థానం నందు నిర్వహించే ఆర్జిత సేవలైన (రాహుకేతు పూజలు అభిషేకములు, చండీ, రుద్ర హోమములు, కల్యాణోత్సవం, శనీశ్వర స్వామి అభిషేకం)ను మార్చి19 నుంచి ఈనెల31వరకు నిలుపుదల చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఆలయంలో స్వామి, అమ్మవార్లకు జరుపు అన్ని నిర్ణీత కాల పూజలు, సర్కారీ సేవలు యథావిధిగా, శాస్త్రోక్తముగా ఎట్టి మార్పులు లేకుండా దేవస్థానం వారే నిర్వహిస్తారని కూడా స్పష్టం చేశారు. కావున భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి దేవస్థానం వారికి సహకరించగలరని కోరారు.
tags ; sri kalahasti temple, ap, chittoor, carona virus, close till march 31st