‘‘ఎస్ఆర్డీపీ పనులు వేగంగా చేయాలి’’

by Shyam |
‘‘ఎస్ఆర్డీపీ పనులు వేగంగా చేయాలి’’
X

ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన అన్ని పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, డిస్కమ్, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్ఆర్డీపీ పనుల వారిగా ప్రగతిని సమీక్షించారు. మౌళిక వసతుల అభివృద్ధికి, సులభ రవాణాకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఇతర పనులను ఏకకాలంలో కట్టుటకు అదనపు మెటీరియల్‌ను సిద్ధం చేయించాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed