శ్రావ్యమైన మనసున్న సామాజిక ‘కళా’ కారిణి

by Sujitha Rachapalli |
శ్రావ్యమైన మనసున్న సామాజిక ‘కళా’ కారిణి
X

దిశ, ఫీచర్స్ : అవయవదానం, నేత్రదానం, అన్నదానంతో పాటు జుట్టు దానం (హెయిర్ డొనేషన్ ) కూడా ప్రస్తుతం ప్రాముఖ్యతను కలిగి ఉంది. క్యాన్సర్ బాధితుల కోసం చాలా మంది తమ హెయిర్ డొనేట్ చేస్తుండగా.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కూచిపూడి డ్యాన్సర్ ‘శ్రావ్యమానస’ కూడా ఆ లిస్టులో చేరింది. తన నృత్య కళ ద్వారా నిద్రాణమైన సమాజాన్ని తట్టి లేపుతూనే తన కురులను కూడా సామాజిక సేవలో భాగంగా దానం చేసింది శ్రావ్య.

క్యాన్సర్ పేషెంట్లు.. కీమోథెరపీ, రేడియేషన్ చికిత్స వల్ల తమ జుట్టు కోల్పోవడాన్ని చూశానని, అలాంటి వారికి తన జుట్టు ఉపయోగపడుతుందనే డొనేట్ చేసినట్లు శ్రావ్య తెలిపింది. చాలా మంది క్యాన్సర్ బాధితులు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారే ఉన్నారని, వారిలో కొంతమందిని ఇటీవలే తాను కలిశానని చెప్పింది. వాళ్ల బాధలకు చలించిపోయి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కురులు ఉంటేనే అందంగా ఉంటారని తాను అనుకోవడం లేదని, హెయిర్ డొనేషన్ వల్ల తనలోని తనను(ఇన్‌సైడర్)ను గుర్తించుకున్నానని, అందుకు గర్వపడుతున్నానని శ్రావ్య పేర్కొనడం విశేషం. కాగా ప్రొఫెషనల్ నృత్య కళాకారిణిగా.. సత్యభామ తదితర మేల్ రోల్స్ ప్లే చేసేటపుడు విగ్ ధరిస్తున్నానని చెప్పింది. ఎవరికి వారు ఆత్మవిశ్వాసంతో ఉండటమే నిజమైన అందమని, ఫిజికల్ అప్పీయరెన్స్ కాదని తెలిపింది శ్రావ్య.

Advertisement

Next Story

Most Viewed