- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పుత్నిక్-వి వ్యాక్సిన్ షురూ
దిశ, తెలంగాణ బ్యూరో : రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ పంపిణీ దేశంలో మొదలైంది. పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన రెడ్డీస్ లాబ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో లాంఛనంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. రెడ్డీస్ లాబ్ స్టాఫ్ అశోక్ తొలి డోసును అందుకున్నారు. మంగళవారం వైజాగ్ ఆస్పత్రి (అపోలో), ఆ తర్వాత మెట్రో నగరాల్లోని ఆస్పత్రుల్లో ప్రారంభం కానుంది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఒప్పందం నగరానికి చెందిన రెడ్డీస్ లాబ్ కుదుర్చుకున్నందున ప్రస్తుతం సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే పైలట్ పద్ధతిలో టీకాల పంపిణీ జరుగుతోంది. ఈ ప్రక్రియ ముగిసే లోపు రష్యా నుంచి ఎన్ని డోసులు వస్తాయో, దానిని నిల్వ చేసుకోడానికి సమకూర్చుకునే సౌకర్యాలకు అనుగుణంగా ప్రజలందరికీ ఇవ్వడంపై స్పష్టత వస్తుందని అపోలో ఆస్పత్రి, రెడ్డీస్ లాబ్ ప్రతినిధులు తెలిపారు.
ప్రస్తుతం స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఒక్కో డోసు ధరను రూ. 995గా ఖరారైంది. త్వరలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని రెడ్డీస్ లాబ్ ప్రతినిధులు తెలిపారు. దాని ధర సుమారు రూ. 1,250 ఉండొచ్చని సూచనప్రాయంగా తెలిపారు. ఇప్పటివరకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌లను సుమారు ఎనిమిది లక్షల మందికి ఇచ్చినట్లు అపోలో ఆస్పత్రి ప్రెసిడెంట్ డాక్టర్ హరిప్రసాద్ తెలిపారు. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఎన్ని డోసులు వస్తాయో ఇంకా క్లారిటీ లేనందున నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకోలేదని, దిగుమతి మీదనే ఆధారపడుతున్నట్లు తెలిపారు.