- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జహీర్ ఖాన్‌తో ఆ ఫ్రాంచైజీ చర్చలు?.. మెంటార్ రోల్ ఇవ్వనుందా?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ వచ్చే సీజన్‌కు కోచింగ్ స్టాఫ్‌ను బలోపేతం చేసుకోవాలని చూస్తున్నది. గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో తొలి రెండు సీజన్లలో లక్నో ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఈ సీజన్‌కు ముందు కోల్‌కతాకు మారిన గంభీర్.. కేకేఆర్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు, లక్నో లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది. గంభీర్ నిష్ర్కమణ లోటును పూడ్చడానికి సరైన మెంటార్ కోసం లక్నో అన్వేషిస్తున్నది. భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌పై లక్నో యాజమాన్యం ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
తాజాగా జహీర్ ఖాన్‌తో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. మెంటార్‌గా నియమించడంతోపాటు అతని పాత్రను విస్తరించాలని, ఆఫ్ సీజన్‌లో జట్టు నిర్మాణం, ప్లేయర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్స్‌లో భాగం చేయాలని లక్నో భావిస్తున్నట్టు ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన జహీర్ మొత్తం 100 మ్యాచ్‌ల్లో 102 వికెట్లు పడగొట్టాడు. 2017లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అతను ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు గ్లోబల్ డెవలప్‌మెంట్ హెడ్‌గా ఉన్నాడు. 2018 నుంచి 2022 వరకు ముంబైకే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలందించాడు. భారత్ తరపున 309 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జహీర్ మొత్తం 610 వికెట్లు తీసుకున్నాడు.
- Tags
- #Zaheer Khan