- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yuzvendra Chahal : అతని చూడగానే నోటి నుంచి మాట రాదు
దిశ, వెబ్‌డెస్క్: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో ఉన్న తన అనుబంధాన్ని టీమిండియా స్పిన్నర్ యుజేంద్ర చాహల్ గుర్తు చేసుకున్నాడు. ధోనీని చూడగానే తనకు ఎక్కడలేని క్రమశిక్షణ వచ్చేస్తుందని, అతను ముందు ఉంటే తన నోటి నుంచి మాటలు కూడా రావని చాహల్ అన్నాడు. మైదానంలో చాహల్ చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లోనూ చాహల్ జోకులు వేస్తూ.. అందర్నీ నవ్విస్తుంటాడు. ప్రతీ ఒక్కరిని తన పనులతో విసిగిస్తుంటాడు. అంత అల్లరిగా ఉండే చాహల్.. ధోనీని చూడగానే క్రమశిక్షణగా మారిపోతాడంట. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు.
'కేవలం ధోనీ ముందు మాత్రమే నేను సైలెంట్‌గా ఉంటాను. అతను నా ముందుకు వచ్చేసరికి నా నోరు ఆటోమేటిక్‌గా మూతపడుతోంది. ధోనీ భాయ్ ముందు అనవసర విషయాలు మాట్లాడను. ధోనీ అడిగిన వాటికే సమాధానమిస్తాను. లేకపోతే మౌనంగా కూర్చుంటాను. ధోనీ భాయ్ నాకు చాలా మద్దతు ఇచ్చేవాడు. నాది కానీ రోజు కూడా అండగా ఉండేవాడని'.. చాహల్ చెప్పుకొచ్చాడు. ధోనీ సారథ్యంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఓ వెలుగు వెలిగారు. ఇద్దరూ కలిసి ఎన్నో చిరస్మరణీయ విజయాలందించారు. కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాత కుల్దీప్ దూరం కాగా.. చాహల్ ఒక్కడే జట్టులో కొనసాగాడు.