ఇంతింతై వటుడింతయై.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఎగబాకిన యశస్వీ జైస్వాల్

by Shiva |
ఇంతింతై వటుడింతయై.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఎగబాకిన యశస్వీ జైస్వాల్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యువ సంచలనం యశ్వస్వీ జైస్వాల్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సీరీస్‌లో అదగొడుతున్నాడు. ఆడిన నాలుగు టెస్టుల్లోనే ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన యశస్వీ.. రెండు డబుల్ సెంచరీలతో 93.57 సగటుతో మొత్తం 655 పరుగులు చేశాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లలో 73 రెండో ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసి ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో తక్కువ సమయంలోనే ఉత్తమ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.

తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో యశస్వీ జైస్వాల్ 12వ స్థానంలో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు పరుగులే చేయడంతో ఒక స్థానం దిగజారి 13 స్థానానికి పరిమితమయ్యాడు. జైస్వాల్‌కు 727 రేటింగ్ పాయింట్స్ రాగా, హిట్ మ్యాన్‌కు 720 రేటింగ్ పాయింట్స్ వచ్చాయి. ఇక ఇంగ్లండ్‌ స్టార్ బ్యాటర్ జో రూట్ (799) రాంచీ టెస్టులో సెంచరీ చేసి రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకున్నాడు. టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్స్, స్టీవ్ స్మిత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ సిరీస్‌కు దూరంగా ఉండటం విరాట్ కోహ్లీ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Next Story