- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువ సంచలనం.. యశస్వి పేరిట నమోదైన రికార్డులివే!
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టులో స్థానం పొందిన కొన్నాళ్లకే తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం జట్టుకు పూర్తి స్థాయి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైస్వాల్ ఇంగ్లాండ్‌లో స్వదేశంలో జరుగుతున్న టెస్టుల్లో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే తన పేరిట కొన్ని అదురైన రికార్డులు నమోదయ్యాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
1. ఒక టెస్ట్ సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక సిక్సులు(22) కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
2. వరుస మ్యాచుల్లో డబుల్ సెంచరీలు చేసిన మూడో ఇండియన్ ప్లేయర్ కావడం విశేషం.
3. టెస్టు మ్యాచుల్లో వేగంగా ద్విశతకం బాదిన రెండో భారత ఆటగాడు జైస్వాల్.
4. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు(12) బాదిన వసీమ్ అక్రమ్ రికార్డు సమం చేశాడు.
కాగా, రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. ఈ సిరీస్‌లో వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు. మూడో రోజు ఆటలో సెంచరీ అనంతరం గాయంతో మైదానాన్ని వీడిన జైస్వాల్.. కోలుకుని మరి నాలుగో రోజు బ్యాటింగ్ వచ్చి డబుల్ సెంచరీ బాదాడు. మొత్తంగా 236 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 14 ఫోర్లు, 12 సిక్సులతో 214 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.