డబ్ల్యూటీసీ ఫైనల్‌.. లండన్‌కు టీమ్ ఇండియా తొలి బ్యాచ్

by Vinod kumar |   ( Updated:2023-05-22 13:42:23.0  )
డబ్ల్యూటీసీ ఫైనల్‌.. లండన్‌కు టీమ్ ఇండియా తొలి బ్యాచ్
X

ముంబై: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌‌కు సమయం దగ్గరపడుతున్నది. లండన్‌లో ఓవల్ స్టేడియంలో జూన్ జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు జరిగే తుది పోరులో తలపడేందుకు భారత్, ఆస్ట్రేలియా ఎదురుచూస్తున్నాయి. ఐపీఎల్-16 నేపథ్యంలో భారత ఆటగాళ్లు రెండు లేదా మూడు బ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నారు. ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న టీమ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేయర్స్ మినహా లీగ్ దశకే పరిమితమైన ఇతర జట్ల ఆటగాళ్లు తమ మ్యాచ్‌లను పూర్తి చేశారు. దాంతో తొలి బ్యాచ్‌లో భాగంగా విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ నేడు లండన్‌కు బయల్దేరనున్నారు.

వారితోపాటు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, ముగ్గురు నెట్ బౌలర్లు కూడా వెళ్లనున్నారు. ఐపీఎల్ అనంతరం ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండానే ఆయా ఆటగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సన్నద్ధమయ్యేందుకు ఇంగ్లాండ్ వెళ్తున్నారు. గాయం కారణంగా ఐపీఎల్ మధ్యలోనే తప్పుకున్న జయదేవ్ ఉనద్కత్ సైతం మొదటి మ్యాచ్‌లోనే లండన్ వెళ్లనున్నాడు. ప్రస్తుతం అతను కోలుకుంటుండగా.. ఫైనల్ మ్యాచ్‌లో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లాండ్‌లోకే కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రహానే, షమీ, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్, సూర్యకుమార్ ప్లే ఆఫ్స్‌లో తమ మ్యాచ్‌లు ముగియగానే ఇంగ్లాండ్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.

Advertisement

Next Story

Most Viewed