WTC Final 2023: టీమ్ ఇండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్‌ శర్మకు గాయం..!

by Vinod kumar |   ( Updated:2023-06-06 12:35:14.0  )
WTC Final 2023: టీమ్ ఇండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోహిత్‌ శర్మకు గాయం..!
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైనట్లు తెలుస్తోంది. మంగళవారం నెట్స్‌లో రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. అతని ఎడమ చేతి బొటన వేలికి గాయమైనట్లు సమాచారం. బౌలర్ వేసిన బంతి బలంగా తాకడంతో రోహిత్ నొప్పితో విలవిలాడినట్లు తెలుస్తోంది. నిన్న ప్రాక్టీస్‌ సందర్భం‍గా ఇషాన్‌ కిషన్‌ స్వల్పంగా గాయపడగా.. తాజాగా (ఇవాళ) జట్టు సారధి రోహిత్‌ శర్మ చేతి వేలికి దెబ్బతగిలించుకున్నాడు.

గాయం తీవ్రత తదితర విషయాలపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ రోహిత్‌ ఎడమ చేతి వేలికి బ్యాండ్‌ ఎయిడ్‌ చుట్టుకుంటూ కనిపించిన ఓ దృశ్యం ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఈ గాయంతో హిట్ మ్యాన్ ప్రాక్టీస్ నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. కీలక ఫైనల్ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ గాయపడినట్లు వస్తున్న వార్తలపై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

ఆస్ట్రేలియా (అంచనా):

ఉస్మాన్‌ ఖ్వాజా, డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ట్రవిస్‌ హెడ్‌, కెమరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ (వికెట్‌కీపర్‌), పాట్‌ కమిన్స్‌, నాథన్‌ లియోన్‌, స్కాట్‌ బోలండ్‌, మిచెల్‌ స్టార్క్‌

టీమిండియా (అంచనా):

రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, ఇషాన్‌ కిషన్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ, జయదేవ్‌ ఉనద్కత్‌, మహ్మద్‌ సిరాజ్‌

Advertisement

Next Story