- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WPL Auction : తెలుగమ్మాయి చరణికి భారీ ధర.. అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై కోట్లు
దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలంలో ముంబై ఆల్‌రౌండర్ సిమ్రాన్ షేక్ జాక్‌పాట్ కొట్టింది. రూ.10 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆమె రూ.1.9 కోట్లు కొల్లగొట్టింది. బెంగళూరు వేదికగా డబ్ల్యూపీఎల్ వచ్చే సీజన్‌కు సంబంధించిన వేలం ఆదివారం జరిగింది. ఆక్షన్‌లో 19 మందిని ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. అందులో 14 మంది భారతీయులు ఉండగా.. ఐదుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఫ్రాంచైజీలు మొత్తం రూ.9.05 కోట్లు వెచ్చించాయి. వేలంలో భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించాయి. ఈ వేలంలో సిమ్రాన్ షేక్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్‌గా నిలిచింది. ఆమెను గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడి మరి సిమ్రాన్‌ను జట్టులోకి తీసుకుంది. విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ కోసం కూడా గుజరాత్ భారీ ధర వెచ్చించింది. రూ.1.7 కోట్లకు కుమ్మురించింది. దీంతో టాప్-2 ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్లు జెయింట్స్ జట్టులో చేరారు. తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల జి.కమలిని కూడా భారీ ధర పలికింది. రూ.10లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఆమెను ముంబై ఇండియన్స్ రూ.1.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అలాగే, ఉత్తరప్రదేశ్ స్పిన్నర్ ప్రేమ రావత్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.1.2 కోట్లకు దక్కించుకుంది.
తెలుగమ్మాయికి భారీ ధర
వేలంలో తెలుగమ్మాయి, ఆంధ్ర జట్టు ఆల్‌రౌండర్ ఎన్.చరిణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ.10 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆమె కోసం ఫ్రాంచైజీ పోటీపడ్డాయి. చివరికి చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ప్లేయర్లలో ఆమె నిలిచింది.
వేలంలో స్టార్లు అన్‌సోల్డ్
వేలంలో స్టార్ ప్లేయర్లపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. భారీ ధర పలుకుతుందనుకున్న భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అలాగే, బౌలర్ పూనమ్ యాదవ్ కూడా అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది. ఇంగ్లాండ్‌కు చెందిన హీథర్ నైట్, ఆసిస్ క్రికెటర్లు డార్సీ బ్రౌన్, కిమ్ గార్త్‌లకు కూడా నిరాశ తప్పలేదు.
- Tags
- #WPL Auction