WPL-2025: నేటి నుంచి ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్ షురూ.. బెంగళూరు టీంకు ఎదురుదెబ్బ

by Shiva |   ( Updated:14 Feb 2025 4:05 AM  )
WPL-2025: నేటి నుంచి ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్ షురూ.. బెంగళూరు టీంకు ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2025కు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌ వడోదర (Vadodara)లోని కొటంబి స్టేడియం (Kotambi Stadium) వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) - గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) జట్లు తలపడబోతున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు (Bengaluru) జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు స్టార్ ప్లేయర్లు గాయాల వల్ల ఈ సీజన్ కు దూరం కాగా.. తాజాగా మరో ఇప్పుడు ప్లేయర్లు కూడా టోర్నీకి దూరమయ్యారు. ఇవాళ జరిగబోయే మ్యాచ్ ప్రారంభానికి ముందు 33 ఏళ్ల స్టార్ లెగ్‌ స్పిన్నర్‌ ఆశా శోభన (Asha Shobhana) గాయం వల్ల తప్పుకుంది. ఈ విషయాన్ని జట్టు మేనేజ్‌మెంట్ అధికారికంగా ధృవీకరించింది. దీంతో ఆమె స్థానంలో భారత వికెట్ కీపర్ నుఝత్ పర్వీన్‌ (Nujhat Parveen)తో రీప్లేస్ చేయనున్నట్లుగా ఆ జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.

కాగా, డబ్ల్యూపీఎల్-2025 (WPL-2025) సీజన్ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు జరగనున్నాయి. క్రితం సీజన్ మాదరిగానే ఐదు జట్లు బరిలోకి దిగాయి. ఈ సారి లీగ్‌లో మొత్తంగా 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో 20 లీగ్ మ్యాచ్‌లు ఉన్నాయి. 2 నాకౌట్ మ్యాచ్‌లు (ఎలిమినేటర్, ఫైనల్)లను నిర్వహించనున్నారు. అయితే, ఈ డబ్ల్యూపీఎల్ (WPL) మ్యాచ్‌లు మొత్తం నాలుగు మైదానాల్లో జరగనున్నాయి. అందులో వడోదర (Vadodara), బెంగళూరు (Bengaluru), లక్నో (Lucknow), ముంబై (Mumbai) నగరాలు ఉన్నాయి. కాగా గత సీజన్‌లో డబ్ల్యూపీఎల్ (WPL) మ్యాచ్‌లు బెంగళూరు (Bengaluru), న్యూఢిల్లీ (New Delhi) వేదికగా జరిగాయి.

Next Story

Most Viewed