- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంతర్జాతీయ క్రికెట్ లో పరమ చెత్త రికార్డ్ నమోదు..!
by Shiva |
X
దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ లో అత్యంత పరమ చెత్త రికార్డు నమోదైంది. ఇందుకు వేదిక షార్జా స్టేడియం వేదికగా నిలిచింది. పాకిస్థాన్ ఆటగాడు అబ్దుల్లా షఫీక్ టీ20ల్లో చెత్త రికార్డు నమోదు చేశారు. వరుసగా నాలుగు మ్యాచుల్లో గోల్డెన్ డకౌటైన తొలి ఆటగాడిగా నిలిచారు. ఆదివారం షార్జాలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో షఫీక్ డకౌటయ్యాడు. అంతకు ముందు మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో అలాగే 2020లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచుల్లో రెండు సార్లు డకౌట్ గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండు టీ20ల్లో రెండో బంతికే డకౌటైన షఫీక్.. అఫ్ఘాన్ తో తొలి మ్యాచ్ లో రెండో బంతికి, రెండో మ్యాచ్ లో తొలి బంతికే వెనుదిరిగారు. రైట్ హ్యాండ్ బ్యాటర్ దాదాపు మూడేళ్ల తరువాత జట్టులో తిరిగి స్థానం సంపాదించుకున్నా.. ఖాతా తెరవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు.
Advertisement
Next Story