అమెరికా పేసర్‌కు షాకిచ్చిన ఐసీసీ..

by Vinod kumar |
అమెరికా పేసర్‌కు షాకిచ్చిన ఐసీసీ..
X

హరారే: యునైటెడ్ స్టేట్స్ పేసర్ కైల్ ఫిలిప్‌‌కు ఐసీసీ షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఫిలిప్ బౌలింగ్ యాక్షన్‌ ఉండటంతో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా అతన్ని సస్పెండ్ చేసింది. వన్డే వరల్డ్ కప్-2023 క్వాలిఫయర్స్ టోర్నీలో ఈ నెల 18న వెస్టిండీస్, అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఫుటేజ్‌ను చూసిన ఐసీసీ ఈవెంట్ ప్యానెల్.. ఫిలిప్ బౌలింగ్‌ను పరిశీలించింది.

అతను నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడని గుర్తించిన ప్యానెల్.. ఆర్టికల్ 6.7 ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌లో అతన్ని బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది. ఫిలిప్ నిబంధనలకు లోబడి బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకుని పున:పరిశీలనలో ఐసీసీ చట్టబద్దమైనదని నిర్దారించే వరకూ అతనిపై నిషేధం కొనసాగుతుంది.

Advertisement

Next Story

Most Viewed