- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CHESS : క్వార్టర్స్‌కు వైశాలి.. కోనేరు హంపి, అర్జున్ ఔట్
దిశ, స్పోర్ట్స్ : ఇటీవల ర్యాపిడ్ చెస్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తెలుగు తేజం కోనేరు హంపి బ్లిట్జ్ విభాగంలో కూడా వరల్డ్ చాంపియన్ అవుదామనుకున్న ఆమె కల ఫలించలేదు. న్యూయార్క్‌లో జరుగుతున్న వరల్డ్ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆమె నాకౌట్‌కు చేరుకోకముందే నిష్ర్కమించింది. మంగళవారం జరిగిన 11 రౌండ్లలో 8 పాయింట్లు సాధించి 9వ స్థానంతో సరిపెట్టింది. ఇక, మరో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.వైశాలి సత్తాచాటింది. క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 11 రౌండ్లలో ఆమె 9.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క రౌండ్ కూడా కోల్పోకపోవడం గమనార్హం. 8 రౌండ్లలో నెగ్గగా.. మరో మూడు రౌండ్లలో డ్రా చేసుకుంది. నేడు క్వార్టర్స్‌లో వైశాలి.. చైనాకు చెందిన ఝు జినెర్‌తో ఆడనుంది. మహిళల, పురుషుల విభాగాల్లో భారత్ తరపున నాకౌట్‌కు చేరుకున్నది వైశాలి మాత్రమే. ఓపెన్ విభాగంలో తెలుగు కుర్రాడు అర్జున్ ఇరిగేశి 7 పాయింట్లతో 64వ స్థానంలో నిలిచాడు. ముందుగా తొలి ఐదు రౌండ్లను నెగ్గి దూకుడుగా కనబర్చిన అర్జున్.. మిగతా రౌండ్లలో ఆ జోరును కొనసాగించలేకపోయాడు. ఆర్.ప్రజ్ఞానంద 8 పాయింట్లతో 23వ స్థానంతో భారత్ తరపున మెరుగైన స్థానంతో ముగించాడు. మహిళల, పురుషుల విభాగాల్లో టాప్-8 నిలిచిన వారే నాకౌట్ రౌండ్‌కు చేరుకుంటారు.