- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షంతో నిలిచిన మ్యాచ్.. వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా..
దిశ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్ లో టీమిండియా సెమీఫైనల్లో ప్రవేశించింది. ఇవాళ ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా డక్ వర్త్ లూయిస్ విధానంలో 5 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఐర్లాండ్ లక్ష్యఛేదనలో 8.2 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం విజేతను నిర్ణయించారు. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఐర్లాండ్ స్కోరు 2 వికెట్లకు 54 పరుగులు. డీఎల్ఎస్ ప్రకారం.. అప్పటికి 59 పరుగులు చేసుంటే ఐర్లాండే గెలిచేది. కానీ, ఐర్లాండ్ 5 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో టీమిండియా అమ్మాయిలు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నారు.
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. భారత ఓపెనర్ స్మృతి మంధన విజృంభించింది. స్మృతి మంధన 56 బంతుల్లోనే 87 పరుగులు చేయడం విశేషం. ఆమె స్కోరులో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మరో ఎండ్ లో ఇతర బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయకపోవడంతో భారత్ కు భారీ స్కోరు సాధ్యం కాలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో.. యువ బ్యాటర్ షెఫాలీ వర్మ 24, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 13, జెమీమా రోడ్రిగ్స్ 19 పరుగులు చేశారు. రిచా ఘోష్, దీప్తి శర్మ డకౌట్ అయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో కెప్టెన్ లారా డెలానీ 3 వికెట్లు తీసింది. ఓర్లా ప్రెండెర్ గాస్ట్ 2, ఆర్లెన్ కెల్లీ 1 వికెట్ పడగొట్టారు.