- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Womens T20 trophy : సీనియర్ వుమెన్స్ టీ20 విజేతగా ముంబై
దిశ, స్పోర్ట్స్ : డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై సీనియర్ వుమెన్స్ టీ20 ట్రోఫీని మరోసారి గెలుచుకుంది. మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ ను 85 పరుగులకే ఆలౌట్ చేసింది. ఓపెనర్ ధారా గుజ్జర్ 38 బంతుల్లో 26 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. బెంగాల్ 15 ఓవర్లలో 51 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. హర్షిత బసు, టైటస్ సాదు ఏడో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. అయినా బెంగాల్ వంద మార్కు దాటలేకపోయింది. ముంబై జట్టులో జార్గవి పవార్ మూడు వికెట్లు, సౌమ్య సింగ్ 2 వికెట్లు తీసి రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 7.3 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్‌ను చేధించింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న కాజీ 36 బంతుల్లో 41 పరుగులు చేసింది. మరో వృశాలి భగత్ 39 బంతుల్లో 45 పరుగులు చేసింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ ఇద్దరు ప్లేయర్స్ 12.3 ఓవర్లలో 86 పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించారు. ఐదుగురు బౌలర్లను బెంగాల్ దించిన ఒక్క వికెట్ కూడా దక్కలేదు. సీనియర్ వుమెన్స్ టీ20 ట్రోఫీలో రైల్వేస్ తర్వాత వరుసగా రెండు టైటిల్స్ గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది.