WI vs SA : సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. T20 సిరీస్ కైవసం చేసుకున్న వెస్టిండీస్

by Maddikunta Saikiran |
WI vs SA : సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. T20 సిరీస్ కైవసం చేసుకున్న వెస్టిండీస్
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న T20 సిరీస్ లో ఆతిథ్య వెస్టిండీస్ సత్తా చాటుతోంది. ఇప్పటికే మొదటి టీ20 మ్యాచ్ గెలిచిన వెస్టిండీస్ అదే ఊపుతో రెండో టీ20లో కూడా ఘన విజయం సాధించింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండో టీ20లో విండీస్ టీం 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. కాగా టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్న సౌతాఫ్రికా, వెస్టిండీస్ ను 179 పరుగులకు కట్టడి చేసింది.అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 149 పరుగులే చేసి 30 పరుగుల తేడాతో ఓటమి పాలయింది.

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, షాయ్ హోప్ (41), పావెల్ (35) పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 179/6 స్కోర్ చేసింది. ఛేదనలో సఫారీ జట్టు 149 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రొటీస్ టీంలో రీజా హెన్డ్రిక్స్ ఒక్కడే 44 పరుగులతో రాణించాడు. కాగా మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో వరుసగా రెండు విజయాలతో వెస్టిండీస్ సిరీస్ ను దక్కించుకుంది. అయితే నామమాత్రమైన మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 28న జరగనుంది. కాగా దక్షిణాఫ్రికాపై విండీస్ కు ఇది వరుసగా మూడో టీ20 సిరీస్ విజయం.

Next Story