- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాయిస్ స్మార్ట్ వాచ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా Virat Kohli
దిశ, వెబ్‌డెస్క్: నాయిస్ బ్రాండ్ అనగానే మనందరికి గుర్తుకువచ్చేది నాణ్యత. దేశంలోనే అత్యుత్తమ లైఫ్‌స్టైల్ టెక్ బ్రాండ్ ఉత్పత్తులను అందిస్తోన్న సంస్థ నాయిస్. నాయిస్ సంస్థ ఇప్పుడు తమ స్మార్ట్ వాచ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా యూత్ ఐకాన్, కింగ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా విరాట్ కోహ్లీ ని నియమించింది. మనలో ఉన్న శబ్దాన్ని అంటే ప్రతిభను చాలా ప్రశాంతంగా వినడం, విని దాన్ని ఆచరణలో పెట్టడం అనే కాన్సెప్ట్‌కు నాయిస్.. విరాట్ ప్రతీకలుగా నిలుస్తారు. ఇప్పుడు విరాట్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం ద్వారా వినియోగదారుల విశ్వాసం పెరుగుతుంది. అలాగే బ్రాండ్‌పై వినియోగదారులకు మరింత నమ్మకం కుదురుతుంది. ఈ సందర్భంగా నాయిస్ సహ వ్యవస్థాపకుడు శ్రీ గౌరవ్ ఖత్రీ మాట్లాడుతూ.. "భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని నాయిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. విరాట్ ఎలా అయితే ప్రపంచస్థాయి విజేతగా మారాడో మేం కూడా మా స్మార్ట్‌వాచ్ డొమైన్లో అలాగే విశ్వవిజేతగా మారాం. విరాట్ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కష్టపడతాడో.. మేం కూడా మనసు చెప్పే శబ్దాన్ని వినేందుకు నిరంతర ఉత్సాహంతో పని చేస్తుంటాం. ఇప్పుడు విరాట్‌తో అనుబంధం ద్వారా భారతదేశంలో, విదేశాలలో ఉన్న యూత్ అందరికి మా బ్రాండ్ మరింత దగ్గర అవుతుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాను అని అన్నారు.
స్మార్ట్ కనెక్టెడ్ లైఫ్‌స్టైల్ ఇండస్ట్రీలో నాయిస్ ఎలా అయితే లీడర్‌గా ఉందో క్రికెట్ వరల్డ్‌లో విరాట్ కూడా అలాగే లీడర్‌గా ఉన్నాడు. అంతేకాకుండా విరాట్ ఎల్లప్పుడూ తన ఫిట్‌నెస్‌పై దృష్టిపెడుతుంటాడు. ఇంకా చెప్పాలంటే సూపర్-అథ్లెట్ల శకానికి నాంది పలకడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. అందుకే మా స్మార్ట్ లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు అతను బ్రాండ్ అంబాసిడర్‌గా పర్ఫెక్ట్గా సరిపోతాడు. స్మార్ట్ వాచ్ విభాగంలో నాయిస్ బలమైన భారతీయ బ్రాండ్‌గా ఉద్భవించింది. 9 త్రైమాసికాల్లో బలమైన బ్రాండ్ అనే నిర్వచనాన్ని నిలబెట్టుకుంది. ఇన్నాళ్లు ఈ ప్రయాణంలో స్థిరత్వాన్ని, సరికొత్త ఆవిష్కరణలు, తిరిగి ఆవిష్కరించే సామర్థ్యం మరియు మాస్ అప్పీల్‌ను ప్రదర్శిస్తుంది. ఇవన్నీ కూడా భారతదేశం గర్వించదగ్గ క్రికెటర్ విరాట్ కోహ్లి కి ఉన్న లక్షణాలు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. "నేను ఎలా ఉంటానో, నాలా.. నా అభిరుచిగా తగ్గట్లుగా ఉండే బ్రాండ్లతో పనిచేయడాన్ని నేను ఎప్పుడూ కోరుకుంటాను, వాటిని నమ్ముతాను కూడా. నిరంతరం కొత్త స్టేట్మెంట్లను రూపొందిస్తున్న నాయిస్‌తో ఇప్పుడు భాగస్వామిగా మారినందుకు ఆనందంగా ఉంది. స్మార్ట్ వేరబుల్స్‌లో నాయిస్ భారతదేశాన్ని ప్రపంచ మ్యాప్‌లో ఉంచింది. నేను, నాయిస్ మేకర్స్ యొక్క ఉద్వేగభరితమైన బృందంలో చేరడానికి సంతోషిస్తున్నాను.
- Tags
- virat kohli