- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ కప్ కు ఇప్పటికే ప్లేయర్లను సెలెక్ట్ చేశాం: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్
దిశ, వెబ్ డెస్క్: స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్ ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని టీమిండియా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్లో భారత జట్టు ఆటతీరు చూస్తే మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంది. ఆస్ట్రేలియా వంటి క్వాలిటీ జట్టును ఎదుర్కొనే సమయంలో భారత జట్టు తేలిపోతోంది. వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే నెగ్గినా.. భారత బ్యాటింగ్ లో ఉన్న లోపాలు బహిర్గతమయ్యాయి.
ఇక విశాఖ వన్డే గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ క్రమంలో క్రీడాభిమానులు వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్‌ను పక్కన పెట్టేసి, టీ20 స్పెషలిస్టు అయిన సూర్యకుమార్‌కు అవకాశాలు ఇవ్వడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ కీలక సమయంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సంచలన విషయం వెల్లడించాడు. వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టు జాబితా దాదాపుగా రెడీ అయిపోయిందని ద్రావిడ్ తెలిపాడు. వరల్డ్ కప్ ముందు భారత జట్టును గాయాలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.
బుమ్రా, పంత్, దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ తదితరులంతా గాయాలతో జట్టుకు దూరమైన వారిలో ఉన్నారు. వరల్డ్ కప్‌లో ఆడించే 16-18 మంది ఆటగాళ్లపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చామని రాహుల్ తెలిపాడు. 'భారత పరిస్థితుల్లో ఎక్కువ మ్యాచులు ఆడే అవకాశం ఇక లేదు. అయితే, ఇక్కడ ఆడే అవకాశం రావడం చాలా గొప్ప. ఇక ఐపీఎల్‌ను చూడాలి. అయితే, వరల్డ్ కప్‌లో ఎలాంటి జట్టు కావాలో మాకు ఒక అంచనా ఉంది. ప్రస్తుతానికి 16-18 మంది ఆటగాళ్ల వరకు సెలెక్ట్ చేశాం. వారిపై బాగా ఫోకస్ పెట్టాం' అంటూ రాహుల్ ద్రావిడ్ ఓ మీడియా సంస్థకు తెలిపాడు.