Asia Cup 2023: శ్రీలంకకు వరుస షాక్‌లు.. మరో స్టార్‌ ప్లేయర్‌ ఔట్

by Vinod kumar |
Asia Cup 2023: శ్రీలంకకు వరుస షాక్‌లు.. మరో స్టార్‌ ప్లేయర్‌ ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: Asia Cup 2023కు ముందు శ్రీలంకకు వరుస షాక్‌లు తగుతున్నాయి. ఆ జట్టులోని స్టార్‌ ఆటగాళ్లంతా గాయాలు, కోవిడ్‌ కారణంగా జట్టుకు దూరమవుతున్నారు. తాజాగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొడ కండరాల సమస్యతో బాధపడుతున్న హసరంగ పూర్తి కోలుకోకపోవడంతో లంక బోర్డు అతన్ని జట్టు నుంచి తప్పించింది. హసరంగకు ముందు దిల్షన్‌ మధుష్క, లహీరు కుమార, దుష్కంత చమీరా కూడా గాయాల బారిన పడి ఆసియా కప్‌కు దూరమయ్యారు.

మరో ఆటగాడు ఆవిష్క ఫెర్నాండో కోవిడ్‌ కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ ఐదుగురిని లంక సెలెక్టర్లు తొలుత ఆసియాకప్‌ కోసం ఎంపిక చేశారు. అయితే గాయాలు, కోవిడ్‌ కారణంగా వీరు జట్టుకు దూరం కావడంతో, లంక సెలెక్టర్లు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల జాబితాను ప్రకటించారు. ఆసియా కప్‌లో లంక తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఢీ కొట్టబోతున్నది. ఈ మ్యాచ్‌ ఆగస్ట్‌ 31న పల్లెకెలె వేదికగా జరుగనుంది. సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్‌తో ఆసియా కప్‌ ముగుస్తుంది.

శ్రీలంక జట్టు:

దసున్‌ షనక (కెప్టెన్‌), కుశాల్‌ మెండిస్‌ (వైస్‌ కెప్టెన్‌), పథుమ్‌ నిస్సంక, దిముత్‌ కరుణరత్నే, కుశాల్‌ పెరీరా, చరిత్‌ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, తహీశ్‌ తీక్షణ, దునిత్‌ వెల్లలగే, మతీశ పతిరణ, కసున్‌ రజిత, దుషన్‌ హేమంత, బినుర ఫెర్నాండో, ప్రమోద్‌ మదుషన్‌

Advertisement

Next Story

Most Viewed