ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వనిందు హసరంగా

by Mahesh |   ( Updated:2023-06-26 03:28:26.0  )
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వనిందు హసరంగా
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక బౌలింగ్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. వరుసగా ఐదు వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన హసరంగా ఈ రికార్డును నెలకొల్పాడు. అతను వరుస మ్యాచుల్లో 22 వికెట్లు తీసుకున్నాడు. ODI ప్రపంచ కప్ క్వాలిఫైయర్ 2023 మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై అతని 10-0-79-5తో, ODI క్రికెట్‌లో వరుసగా మూడు ఐదు వికెట్లు తీసిన మొట్టమొదటి స్పిన్నర్‌గా కూడా హసరంగ నిలిచాడు. కాగా శ్రీలంక జట్టు ప్రస్తుతం గ్రూప్ బీ‌లో టాప్ పోజీషన్‌లో కొనసాగుతుంది. దీంతో త్వరలో జరగబోయే 2023 వన్డే ప్రపంచ కప్ కు అర్హత సాదిస్తుందని అందరూ భావిస్తున్నారు.

Advertisement

Next Story