- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాట్‌తో అదిరిపోయే స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పాపులర్ నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయగా.. వీడియో తెగ వైరల్ అవుతోంది. పాపులర్ నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్‌తో కలిసి ఈ వీడియోలో కోహ్లీ కాలు కదిపాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత తిరిగి ముంబై వెళ్లిన కోహ్లీ.. ఈ గ్రూప్‌ను కలవడం జరిగింది.'ముంబైలో ఎవరిని కలిశానో చూడండి' అంటూ నార్వేజియన్ డ్యాన్స గ్రూప్ 'క్విక్ స్టైల్'తో ఉన్న ఫొటోను కోహ్లీ షేర్ చేశాడు. ఆ తర్వాత తను డ్యాన్స్ వేసిన వీడియోను పోస్టు చేశాడు. దీనిలో క్విక్ స్టైల్‌లోని ఒక డ్యాన్సర్ తనకు దొరికిన క్రికెట్ బ్యాటుతో ఏం చేయాలో తెలియక తికమక పడతాడు.
అప్పుడు అక్కడకు వచ్చిన కోహ్లీ అతని చేతిలోని బ్యాట్ తీసుకుని దాన్ని ఎలా వాడాలో చూపిస్తాడు. అదే సమయంలో అతని వెనక మిగతా డ్యాన్సర్లు కూడా చేరడంతో అందరూ డ్యాన్స్ చేసుకుంటూ ముందుకొస్తారు. స్టీరియో నేషన్ కంపోజ్ చేసిన ఇష్క్ పాటకు ఈ గ్రూప్ డ్యాన్స్ చేసింది. అయితే ఈ డ్యాన్స్ వీడియోపై కోహ్లీ భార్య అనుష్క శర్మ, మాజీ లెజెండరీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తదితరులు స్పందించారు. ఒక ఫ్యాన్ అయితే '76వ సెంచరీ సెలబ్రేషన్ మూవ్ ఇదే.. లీక్ అయిపోయింది' అని కామెంట్ చేశాడు. ఇంతకుముందు కూడా తనలో ఒక డ్యాన్సర్ కూడా ఉన్నాడని కోహ్లీ చాలాసార్లు నిరూపించుకున్నాడు.
- Tags
- Virat Kohli