- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సోషల్ మీడియాలో వైరల్‌గా కోహ్లీ పదో తరగతి మెమో..
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ ఒకడు. తన వ్యక్తిగత అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటాడు. తాజాగా కోహ్లీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అతను షేర్ చేసిందేంటో తెలుసా.. అతని 10వ తరగతి మెమో.. మార్కుల షీట్‌పై స్పోర్ట్స్ అని రాసి పోస్టు చేసిన కోహ్లీ.. తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చాడు. ‘మార్కుల జాబితాలో కనీసం చోటు కూడా లేనిది మన జీవితంలో ఎక్కువ భాగమవడం విశేషంగా ఉంది’ అని రాసుకొచ్చాడు.
అయితే, కాసేపటికే కోహ్లీ ఈ పోస్టును డిలీట్ చేశాడు. మార్క్‌షీట్‌లో కోహ్లీ 2004లో పదో తరగతి పాస్ అయినట్లు ఉంది. ఇంగ్లిష్‌లో 83 మార్కులు, హిందీలో 75, సోషల్‌లో 81, మ్యాథ్స్‌లో 51, సైన్స్‌లో 55 మార్కులు వచ్చాయి. స్పోర్ట్స్‌ను అదనపు సబ్జెక్ట్ చేర్చిన అతను.. దానికి మాత్రం మార్కులు వేసుకోలేదు. కోహ్లీ 10వ తరగతి మెమోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది.