- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-20 నుంచి కోహ్లీ ఔట్.. 10 ఏళ్ల తర్వాత తొలిసారి
దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఆ ప్రభావం టెస్టు ర్యాంకింగ్స్‌పై కూడా పడింది. 10 ఏళ్లలో తొలిసారి టాప్-20లో చోటు కోల్పోయాడు. ఐసీసీ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ 8 స్థానాలు దిగజారి 22వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో మూడో టెస్టుల సిరీస్‌లో విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో హాఫ్ సెంచరీ మినహా పెద్దగా ఆకట్టుకోలేదు. రెండు, మూడు టెస్టుల్లో అయితే తేలిపోయిన విరాట్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 23 పరుగులే చేయడం గమనార్హం. అంతకుముందు బంగ్లాపై కూడా రెండు టెస్టుల్లో 99 రన్సే చేశాడు. గతేడాది జూలైలో వెస్టిండీస్‌పై కోహ్లీ చివరి సెంచరీ బాదాడు. కెప్టెన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 26వ ర్యాంక్‌కు దిగజారాడు.
ఐదు స్థానాలు ఎగబాకిన రిషబ్
తాజా ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. ఐదు స్థానాలను వెనక్కినెట్టి తిరిగి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 750 రేటింగ్ పాయింట్లతో 6వ స్థానానికి దూసుకెళ్లాడు. 5వ ర్యాంక్‌కు కేవలం 7 పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత ఇటీవల బంగ్లాపై టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన పంత్ సత్తాచాటుతున్నాడు. ఇటీవల కివీస్‌పై అదరగొట్టాడు. 43.50 సగటుతో 261 రన్స్ చేసి సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాపై సెంచరీ సహా 161 పరుగులు చేశాడు. మరోవైపు, యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ భారత్ తరపున టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఒక్క స్థానం కోల్పోయి 4వ ర్యాంక్‌లో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానాలు మెరుగుపర్చుకుని 16వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ముగ్గురు భారత బౌలర్లు ఉన్నారు. బుమ్రా 3వ స్థానాన్ని కాపాడుకోగా.. అశ్విన్ 5వ స్థానంలో ఉన్నాడు. జడేజా 2 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 7 స్థానాలు మెరుగుపర్చుకుని 46వ ర్యాంక్‌లో నిలిచాడు. భారత గడ్డపై సత్తాచాటిన కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఏకంగా 12 స్థానాలు అధిగమించి 22వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ కేటగిరీలో జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. సుందర్ మూడు స్థానాలు ముందుకు జరిగి 22వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.