Vinod Kambli : ఆస్పత్రిలో స్టెప్పులేసిన వినోద్ కాంబ్లీ.. వీడియో వైరల్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-31 07:14:33.0  )
Vinod Kambli : ఆస్పత్రిలో స్టెప్పులేసిన వినోద్ కాంబ్లీ.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల తీవ్ర అనారోగ్యం(Serious Illness)తో ఆసుపత్రి(Hospital)లో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli) క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం థానెలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్న కాంబ్లీతో చికిత్సలో భాగంగా ఆసుపత్రి వైద్య బృందం ఎక్సర్ సైజులు చేయించే క్రమంలో సినీ గీతాలకు డ్యాన్స్ స్టెప్పులు(Vinod Kambli Dance Steps)లను వేయించారు. ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ స్టెప్పులేసిన వీడియో వైరల్ గా మారింది. చక్ దే ఇండియా పాటకు ఆస్పత్రి సిబ్బందితో కలిసి కాంబ్లీ ఉత్సాహంగా స్టెప్పులేశాడు.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ చిన్ననాటి మిత్రుడైన వినోద్ కాంబ్లీ స్కూల్ డేస్ లోనే కాకుండా ఇండియా జట్టుకు కూడా సచిన్ తో కలిసి ఆడి ఎన్నో రికార్డులు సాధించాడు. సచిన్ మాదిరిగానే ఎంతో ప్రతిభావంతుడైన వినోద్ కాంబ్లీ వ్యసనాల బారిన పడి క్రికెట్ కు దూరమవ్వడంతో పాటు జీవితంలోనూ పతనమై తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు.

కనీసం తన వైద్య చికిత్సకు ఆర్థిక స్థోమత కూడా లేకపోవడంతో సచిన్ సహా మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్ వంటి వారు..బీసీసీఐలు కాంబ్లీ వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. వైద్య బృందం సహకారంతో ప్రస్తుతం వినోద్ కాంబ్లీ వేగంగా కోలుకుంటుండటం పట్ల క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story