Vinesh Phogat : తల్లి కాబోతున్న వినేష్ ఫోగాట్

by M.Rajitha |
Vinesh Phogat : తల్లి కాబోతున్న వినేష్ ఫోగాట్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత మాజీ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్(Vinesh Phogat) మరోసారి వార్తల్లో నిలిచారు. తాను తల్లి కాబోతున్నట్టు వినేష్ స్వయంగా ప్రకటించారు. మా లవ్ స్టోరీ కొత్త చాప్టర్ తో కొనసాగనుందని తన భర్త సోమ్ వీర్ రథీ(Somvir Rathee)తో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్(Instagram) వేదికగా పోస్ట్ చేశారు. దీంతో ఆమె సన్నిహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు వినేష్ ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. కాగా భారత స్టార్ రెజ్లర్ గా వెలుగొందిన వినేష్ ఫోగాట్ 2024 ఆగస్టులో పారిస్ వేదికగా జరిగిన ఒలంపిక్స్(Olympics 2024) లో ఫైనల్ కు చేరింది. అయితే అధిక బరువు ఉన్న కారణంగా ఫైనల్ ఆడకుండానే ఆమె వెనుదిరిగారు. దీనిపై పారిస్ కోర్టుకు వెళ్ళినప్పటికీ లభ్యం లేకుండా పోయింది.

ఈ ఘటనలో దేశం మొత్తం వినేష్ వెంట నిలిచి, ధైర్యం చెప్పింది. ఒలంపిక్స్ అనంతరం స్వదేశానికి చేరిన వినేష్ కు తన సొంత రాష్ట్రం హరియాణాలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించి, రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. డిసెంబరులో జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో(Hariyana Assembly Elections) కాంగ్రెస్ తరపున పోటీ చేసి, ఎమ్మెల్యే(Congress MLA)గా గెలుపొందింది. కాగా తన తోటి రెజ్లర్ సోమ్ వీర్ రథీని 2018లో వివాహం చేసుకోగా.. ప్రస్తుతం తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది వినేష్ ఫోగాట్.

Next Story

Most Viewed