- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డోపింగ్‌లో ఇరికించేందుకు కుట్ర : స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు
దిశ, స్పోర్ట్స్ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు సంజయ్ సింగ్‌పై భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు చేసింది. శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టిన ఆమె.. తనను డోపింగ్‌లో ఇరికించడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించింది. ఏప్రిల్ 19 నుంచి 21 వరకు కిర్గిజ్‌స్తాన్‌లో జరగబోయే ఆసియన్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో వినేశ్ ఫొగట్ 50 కేజీల కేటగిరీలో పాల్గొననున్నది. అయితే, ఈ టోర్నీలో పాల్గొనేందుకు తన కోచ్‌కు, ఫిజియోకు అక్రిడిటేషన్ ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. అక్రిడిటేషన్ లేకుండా వారు పోటీ వద్దకు రాలేరని తెలిపింది.
‘బ్రిజ్‌భూషణ్ ఆయన డమ్మీ సంజయ్ సింగ్ నేను ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. టీమ్‌తోపాటు నియామకమైన కోచ్‌లు బ్రిజ్‌భూషణ్, అతని బృందానికి ఇష్టమైన వారే. కాబట్టి, మ్యాచ్ జరిగే సమయంలో నేను తాగే నీళ్లలో వారు ఏదైనా కలిపి ఇవ్వడాన్ని తోసిపుచ్చలేం. డోపింగ్‌లో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని అనడంలో తప్పు లేదు.’ అని వినేశ్ ఫొగట్ ఆరోపించింది. మరోవైపు, ఆమె ఆరోపణలు డబ్ల్యూఎఫ్‌ఐ వర్గాలు ఖండించాయి. గడువు ముగిసిన తర్వాత ఆమె అభ్యర్థన చేసిందని ఓఉన్నతాధికారి తెలిపారు. అయితే, ఆమె తన వ్యక్తిగత కోచ్, ఫిజియోను తీసుకెళ్లడానికి అభ్యంతరం లేదని, గడువు ముగియడంతో ఆమె అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(యూడబ్ల్యూడబ్ల్యూ) ద్వారా అక్రిడిటేషన్ పొందాల్సి ఉంటుందని చెప్పారు.