- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీమ్ ఇండియాలో ఇగోలు ఉన్నాయి.. శిఖర్ ధావన్ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ: టీమ్ ఇండియాలో ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నట్లు ఎప్పటి నుంచో పుకార్లు చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు మీడియా ముందు బహిరంగంగా బయటపడ్డాయి కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టీమ్ ఇండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు భారత ఆటగాళ్ల మధ్య ఇగో గొడవలపై ప్రశ్న ఎదురైంది. దీనికి ధావన్ బదులిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా రోజులపాటు కలిసి ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయని, అది మానవ స్వభావమని తెలిపాడు.
‘మేము 40 మంది సభ్యులం. దాదాపు 220 రోజులు కలిసి ఉంటాం. అలాంటప్పుడు కొన్నిసార్లు ఆటగాళ్ల మధ్య మనస్పర్దలు వస్తాయి. నేను రోహిత్, కోహ్లీ గురించి మాట్లాడటం లేదు. ఇగో సాధారణ విషయమని చెబుతున్నా. అలాగే, ఆటగాళ్ల మధ్య ప్రేమ, స్నేహం కూడా పెరుగుతుంది’ అని ధావన్ చెప్పుకొచ్చాడు.
అలాగే, ఓపెనర్‌గా తన స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను తీసుకోవడంపై ధావన్ స్పందిస్తూ.. ‘గిల్ టెస్టుల్లో, టీ20ల్లో బాగా ఆడుతున్నాడు. నేనే సెలెక్టరైతే గిల్‌కు కచ్చితంగా అవకాశం ఇస్తాను’ అని తెలిపాడు. కాగా, గిల్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో ధావన్ జట్టులో అవకాశాలు తగ్గిపోయాయి. అతను గతేడాది డిసెంబర్‌లో బంగ్లాతో మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొన్న అతను కేవలం 18 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచాడు.