Vaibhav Suryavanshi : ఆ క్రికెటరే ఆదర్శం.. సీక్రెట్ రివీల్ చేసిన వైభవ్ సూర్యవంశీ

by Sathputhe Rajesh |
Vaibhav Suryavanshi : ఆ క్రికెటరే ఆదర్శం.. సీక్రెట్ రివీల్ చేసిన వైభవ్ సూర్యవంశీ
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టీండిస్ క్రికెట్ లెజెండ్ బ్రియన్ లారా తనకు ఆదర్శం అని వైభవ్ సూర్యవంశీ అన్నాడు. 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో రూ.కోటి10లక్షల ధరకు రాజస్థాన్ రాయల్స్ సూర్యవంశీని ఇటీవల వేలంలో దక్కించుకుంది. దీంతో ఒక్కసారిగా సూర్యవంశీ దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. వైభవ్ ప్రస్తుతం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. ఓ స్పోర్ట్స్ చానెల్ ఇంటర్వ్యూలో ఈ సంచలన ఆటగాడు మాట్లాడుతూ.. కేవలం ఆట మీదనే ఫోకస్ పెట్టినట్లు తెలిపాడు. తన చుట్టూ ఏం జరుగుతోందనే దాన్ని పట్టించుకోవడం లేదన్నాడు. ఆసియా కప్ మీదే దృష్టి సారించినట్లు తెలిపాడు. తనకు ఉన్న స్కిల్స్‌తో క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన బ్రియన్ లారాలా తాను కూడా ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఆటలో నైపుణ్యాలపై ఫోకస్ పెట్టినట్లు తెలిపాడు.

Next Story