Usman Khawaja: ఆసీస్ బ్యాటర్ అరుదైన ఘనత.. యాషెస్‌ చరిత్రలో 26 ఏళ్ల తర్వాత..

by Vinod kumar |
Usman Khawaja: ఆసీస్ బ్యాటర్ అరుదైన ఘనత.. యాషెస్‌ చరిత్రలో 26 ఏళ్ల తర్వాత..
X

దిశ, వెబ్‌డెస్క్: యాషెస్‌ సిరీస్‌-2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా అరుదైన ఘనత సాధించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓవరాల్‌గా 496 పరుగులతో మెరిశాడు. మొత్తంగా మూడు హాఫ్ సెంచరీస్ సాధించాడు. కాగా 1997లో ఆస్ట్రేలియా ఓపెనింగ్‌ బ్యాటర్‌ మాథ్యూ ఇలియట్‌ యాషెస్‌ సిరీస్‌లో మొత్తంగా 556 పరుగులు చేశాడు.

అతడి కెరీర్‌ మొత్తంలో సాధించిన రన్స్‌లో సగానికి పైగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ సందర్భంగానే స్కోర్‌ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో 26 ఏళ్ల తర్వాత ఖవాజా అత్యధికంగా 496 పరుగులు సాధించి మాథ్యూ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. 1997 తర్వాత యాషెస్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసీస్‌ ఓపెనర్‌గా నిలిచాడు. కాగా ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన యాషెస్‌ సిరీస్‌-2023 డ్రాగా ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్‌ గెలుపొంది సిరీస్‌ను 2-2తో సమం చేయగా.. గత సిరీస్‌ గెలిచిన ఆసీస్‌ ట్రోఫీని తమ వద్దే అట్టిపెట్టుకోనుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న క్రిస్‌ వోక్స్‌.. మిచెల్‌ స్టార్క్‌తో కలిసి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు పంచుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed