US Open Mens Singles 2024: యూఎస్ ఓపెన్ ఫైనల్ లో అమెరికన్ ప్లేయర్.. సిన్నర్ తో ఢీ!

by Geesa Chandu |
US Open Mens Singles 2024: యూఎస్ ఓపెన్ ఫైనల్ లో అమెరికన్ ప్లేయర్.. సిన్నర్ తో ఢీ!
X

దిశ, వెబ్ డెస్క్: యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్ ఫైనల్ లో.. అమెరికన్ ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్ ఫైనల్ కు చేరాడు. శనివారం ఉదయం(సెప్టెంబర్ 7) జరిగిన రెండవ సెమీ ఫైనల్ పోరులో తన దేశానికే చెందిన టియాఫో ను ఓడించి తన కెరీర్ లోనే తొలిసారిగా ఫైనల్ కు చేరుకున్నాడు. ఐదు సెట్ల మ్యాచ్ లో హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్ పోరులో.. 4-6, 7-5, 4-6, 6-4, 6-1 తేడాతో టియాఫోను ఓడించాడు. ఈ విజయంతో 18 సంవత్సరాల తర్వాత ఒక అమెరికన్ ప్లేయర్ యూఎస్ ఓపెన్ తుది పోరులో ఆడనున్నాడు.

కాగా, 2023 లో ఆండీ రాడిక్.. యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాక, 2006 లో ఫెదరర్ పై యూఎస్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయాడు. 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు ఒక అమెరికన్ ప్లేయర్ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ప్రవేశించాడు. అయితే మరో సెమీ ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ నెంబర్ 1 జానిక్ సిన్నర్.. జాక్ డ్రేపర్ ను 7-5, 7-6(3), 6-2 తో ఓడించి ఫైనల్ కు చేరాడు. దీంతో యూఎస్ ఓపెన్ సింగిల్స్ లో ఫైనల్ చేరిన తొలి ఇటాలియన్ ప్లేయర్ గా జానిక్ సిన్నర్ చరిత్ర సృష్టించాడు. ఇక యూఎస్ ఫైనల్ పోరు ఆదివారం (సెప్టెంబర్ 8) న జరగనుంది.

Advertisement

Next Story